( సొమవారం నుంచి శుక్రవారం వరకు పని వెనుక పరుగెత్తి , వారాంతం కుడా కంప్యుటర్ల తోను మొబైల్ ఫొను తోను కాలక్షేపం చెస్తూ సతిని అలక్ష్యం చేసే ప్రతి పతికి చిన్న విన్నపం )
వారం సాంతం వేచిన కాంత ఓ సాయంత్రం సొంతం అడిగితే కుదిరేనా
ప్రాంతం మారినా ఇది నిజమయ్యే తంత్రం తెలియని ప్రతి ఇంతి ఇక ఇంతేనా
గుప్పిట బట్టిన అదిరే పుటలు,
మూటగ గట్టిన చెదిరే ఊహలు,
బిగువును జారిన మగువల తెగువలు,
మర మగతన వున్న ఆ మగనికి తగిలితే....
వైరల్ వీరుల పాక్షిక వీక్షణలు,
చరవాణి చిందించు కీరవాణి బాణీలు,
వాట్స్యాపు వినిపించు చురుకు చెణకులు,
ఈ మాధ్యమాల ఓలలొ, అంతర్జాల జోలలొ,
సోయలెక జొగుతున్న ఓ అభినవ లక్ష్మణా....
జతనున్న పడతిని మురిపించే సూత్రం పట్టు
వెసలుబాటు బాట ఒక్కటే గట్టి తంత్రం ఒట్టు
ఓ రెండు జతలతో మొదలెట్టెయ్ యాత్రా జట్టు
మనసెరిగి మసలితే తగువుల గాత్రం గుట్టు
ఈ చిరు వివరం తెలుసుకోగలిగితే అది మహా గొప్ప విధ్య
తెలుసుకొవాల్సిన అవసరం లేదనుకుంటే ఎన్నటికీ తెగని మిథ్య ||
No comments:
Post a Comment