Wednesday, September 26, 2018

ఊసుపోక రాసుకున్న

నీలోలాకుల్లోన నీలాల కన్నుల్లో , ఓ ఆట దాగున్నదే
జుట్టంతా ఓ జట్టై మోమంతా కప్పెట్టి , గుట్టేదో దాస్తున్నదే |
పొడసూపే అర నవ్వు మరుగున విరజాజి , వెలవెల బోతున్నదే
వినగోరి నీ గాత్రం  పరుగెట్టే నా ఆత్రం, కబురైనా ఇవనన్నదే ||







Wednesday, April 13, 2016

విధ్య - మిథ్య

( సొమవారం నుంచి శుక్రవారం వరకు పని వెనుక పరుగెత్తి , వారాంతం కుడా కంప్యుటర్ల తోను మొబైల్  ఫొను తోను కాలక్షేపం చెస్తూ   సతిని అలక్ష్యం  చేసే ప్రతి పతికి చిన్న విన్నపం )      

వారం సాంతం వేచిన కాంత ఓ సాయంత్రం సొంతం అడిగితే కుదిరేనా 
ప్రాంతం మారినా ఇది నిజమయ్యే తంత్రం తెలియని ప్రతి ఇంతి ఇక ఇంతేనా
గుప్పిట బట్టిన అదిరే పుటలు, 
మూటగ గట్టిన చెదిరే ఊహలు, 
బిగువును జారిన మగువల తెగువలు,
మర మగతన వున్న ఆ మగనికి తగిలితే....  

వైరల్ వీరుల పాక్షిక వీక్షణలు,  
చరవాణి చిందించు  కీరవాణి బాణీలు, 
వాట్స్యాపు వినిపించు చురుకు చెణకులు,     
ఈ మాధ్యమాల ఓలలొ, అంతర్జాల జోలలొ,       
సోయలెక జొగుతున్న  ఓ అభినవ లక్ష్మణా....   
జతనున్న పడతిని మురిపించే సూత్రం పట్టు  
వెసలుబాటు బాట ఒక్కటే గట్టి తంత్రం ఒట్టు     
ఓ రెండు జతలతో మొదలెట్టెయ్ యాత్రా జట్టు        
మనసెరిగి మసలితే  తగువుల గాత్రం గుట్టు 
  
ఈ చిరు వివరం తెలుసుకోగలిగితే అది మహా గొప్ప విధ్య
తెలుసుకొవాల్సిన అవసరం లేదనుకుంటే ఎన్నటికీ తెగని మిథ్య ||      

Wednesday, April 29, 2015

నీ నవ్వు - నా నువ్వు

మబ్బు పరదా అంచుని మించిన వెన్నెల సరదా నాకిష్టం,
గూడు జేరిన గువ్వ తోడు నింపిన పిల్ల నవ్వు మువ్వ నాకిష్టం। 
తడారిన గుండె గుడారము పిలచిన ఎడారి కొలను నాకిష్టం,
విలువలకై వలువలు సైతం విడిచిన హేమంతం నాకిష్టం ॥ 

పస్తులున్న బెస్తవాని హస్త బడ్డ మీనజాస్తి నాకిష్టం ,
కల ఎరుగని శిలకు కళ నింపిన ఉలి పలుకు నాకిష్టం।
ఉలుకు లేని పొలముకు హలము తెచ్చిన మొలక నాకిష్టం,
వీటి మీరి మునిమాపు వేళ, డస్సిన మనసుకు వీచిన
నీ నవ్వంటే నాకిష్టం, నా నువ్వంటే ఇంకా ఇష్టం ॥ 



Saturday, June 22, 2013

రాయంచ కోసం 
కల కనిపించిన రాయంచవా, కవి వినిపించిన కావ్యానివా 
నింగికెగసిన వింధ్యవా, అరుణ సొగసుల సంధ్యవా ||
రవి గనని ఓ రహస్యమా, అలల మాటున మత్స్యమా 
ఎవ్వరు నీవెవ్వరు మరి తెలుపుమా,ఝరి ఓలె గురు జేరు 'సాంధిత్య'మా ||

Wednesday, October 17, 2012

ఇంత చోటిస్తావా

ఎండ వానకోర్చి సగము చేవ చచ్చి
మట్టి కోట అంచున వున్న మొక్క పిల్లని
ముక్కు పట్టి తెచ్చి గూటి నీడ కూర్చిన
చెట్టు మీది ఆ గువ్వ పిట్ట లాగ

కలల అలల ధాటికి తీరు తెన్ను తెలియక
నడి సంద్రాన నలుగుతున్న నా తలపుల నావకి
నీ చిట్టి మనసులోన ఇంత చోటిస్తావా
దానికి గట్టి లంగరేసి బందిస్తావా !!!



Thursday, September 8, 2011

ఇంకోటి..

మధ్య దక్షిణాన మచ్చుకైన చుక్కలేక
                                           ఘోర కరువు,
తూర్పు ఉత్తరాన తెరపినీక హర్రి'కేక'
                                            చేసె చెరువు,
ఇది నీ తప్పులింక తాళలేక పొరలినట్టి ప్రకృతి
                                           గుండె బరువు,
కాన నేటికైన పుడమితోటి రణమునాపి
                                         కనులు తెరువు..
(To all who suffered and still are in Texas n NorthEast.
Hope the rains go south and send the Sun North)   

                        

Tuesday, August 30, 2011

భాను విలాపం - ప్రియా విన్యాసం

ఉదయ భాస్కరుని తొలి కిరణం
తలచె తన విఘ్నం కారు మేఘమని
మలి తలపు తెలిపె అసలు విషయం
కారణం విరియని నీ కనురెప్పలని

జాలి పడిన ఓ మలయ మారుతం
తాకగ మేఘ మాలిక మొదటి అంచుని..

వీనుల సోకిన తొలి చినుకు సరాగం
మెల్లగ కదల్చెను నీ చిరు మంద హాసవిలాసం
వెనువెంట విచ్ఛిన నీ నయన ఆహ్వానం
ఇలకు తెచ్చె విను వీధి సందేశం

ఇదీ నా మది కాంచిన భాను విలాపం
ఆదిత్యుని విడిపించిన ప్రియా విన్యాసం..