Thursday, September 8, 2011

ఇంకోటి..

మధ్య దక్షిణాన మచ్చుకైన చుక్కలేక
                                           ఘోర కరువు,
తూర్పు ఉత్తరాన తెరపినీక హర్రి'కేక'
                                            చేసె చెరువు,
ఇది నీ తప్పులింక తాళలేక పొరలినట్టి ప్రకృతి
                                           గుండె బరువు,
కాన నేటికైన పుడమితోటి రణమునాపి
                                         కనులు తెరువు..
(To all who suffered and still are in Texas n NorthEast.
Hope the rains go south and send the Sun North)   

                        

Tuesday, August 30, 2011

భాను విలాపం - ప్రియా విన్యాసం

ఉదయ భాస్కరుని తొలి కిరణం
తలచె తన విఘ్నం కారు మేఘమని
మలి తలపు తెలిపె అసలు విషయం
కారణం విరియని నీ కనురెప్పలని

జాలి పడిన ఓ మలయ మారుతం
తాకగ మేఘ మాలిక మొదటి అంచుని..

వీనుల సోకిన తొలి చినుకు సరాగం
మెల్లగ కదల్చెను నీ చిరు మంద హాసవిలాసం
వెనువెంట విచ్ఛిన నీ నయన ఆహ్వానం
ఇలకు తెచ్చె విను వీధి సందేశం

ఇదీ నా మది కాంచిన భాను విలాపం
ఆదిత్యుని విడిపించిన ప్రియా విన్యాసం..

Friday, August 26, 2011

Edhava Nasa...

నార్త్ అమెరికన్ కాంటినేన్టులో,
యునైటెడ్ స్టేట్ల కోటలో,
డాలర్ల తోట గూటిలో,
వెతికావు నోట్ల మూటలు,

ఉద్యోగ బాట వేటలో,
ఊహించని కాలకూట మేటలు,
కలలు గన్న తేనీటి మాటలు ,
కల్లలాయే అవి నీటి వ్రాతలు,

అయితే....

ఒళ్ళొంచి దంచు కష్టాలు రోటిలో,
ఎవెరెస్టు రాదురా షార్టు రూటులో,
పొంగంగ కడలి కంటి చూపుతో రెప్పపాటులో ,
 సంద్రాన సేప గూటికేగక రూటు మర్చునా,

ఈ మేటి మాటని నువ్వు ఒప్పరా,
వ్యక్తిత్వ పోరులో రాటు దేలరా,
గమ్యమ్ము కాక గమనమ్ము మార్చరా,
నీ నుదుట వ్రాతని నువ్వే తేల్చరా...